జేపీ కారణంగా కేంద్రానికి 3లక్షల కోట్ల ఆదాయం!

రాజకీయంగా సఫలం కాకపోయినా , దేశానికి మంచి చేయడం లో ఎప్పుడూ విఫలం కానీ ‘లోక్ సత్తా’ జయప్రకాష్ నారాయణ్ దేశాభివృద్ధి కోసం ఎన్నో మంచి సంస్కరణలు రూపొందించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల సంస్కరణలు, పాలనా సంస్కరణలు,న్యాయ సంస్కరణలు, ఇలా ఎన్నో రంగాలపై ఆయన కొత్త పరిష్కారాల కోసం నిరంతరం కృషి చేస్తుంటారు.  ఆయన చేసే పనుల ఫలితాలు ప్రత్యక్షంగా  ప్రజలకి తెలియకపోయినా, పరోక్షంగా దేశానికి.. దేశప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది.
 
ఉదాహరణకు 2జి స్కాంపై ఆయన దేశం లోని ప్రముఖులు కొందరితో కలిసి జేపీ సుప్రీం కోర్టులో కేసు వేశారు. కంపెనీలు అక్రమంగా పొందిన స్పెక్ట్రం లైసెన్సులు రద్దు చేయాలని, ఇక పై సహజ వనరులు ఏవైనా ప్రైవేటు వ్యక్తులకి కేటాయించేందుకు బహిరంగ వేలం పద్ధతి పాటించాలని వారు, ఈ  పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ వేసిన వారిలో మొదటి పేరు ప్రశాంత్ భూషణ్ అని ఉన్నా,  ఈ కేసు వాదించినందుకు జేపీ ఆధ్వర్యం లో నడిచే ‘ప్రజాస్వామ్య పీఠం’ ఆయనకు ఫీజు చెల్లించిందని చాలా మందికి తెలియని విషయం. మొత్తానికి ఎవరి పేరు ముందున్నా, ఈ కేసు లో సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది.  2జి స్పెక్ట్రం కేటాయింపులని రద్దు చేసింది. ఇక పై స్పెక్ట్రం సహా, అన్ని సహజవనరులను వేలం పద్దతిలోనే కేటాయించాలని తీర్పు ఇచ్చింది.
 
సుప్రీం తీర్పు ప్రకారం ఇప్పుడు కేంద్రం  2జి, 3జి స్పెక్ట్రం , బొగ్గు గనులని వేలం వేస్తోంది. ఈ వేలం ద్వారా ఇప్పటి వరకు  కేంద్రానికి మూడు లక్షల కోట్లు ఆదాయం వచ్చింది. భవిష్యత్తు లో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
 
జేపీతో ఎన్నో  విషయాలలో విబేధించేవారయినా సరే , నిజాన్ని ఒప్పుకునే వారు, మంచిని మంచిగా చూసే వారు మాత్రం 2జీ  కేసులో  ఆయన చొరవని అభినందించాల్సిందే.

Courtesy: Korada

Wednesday, March 11, 2015 - 11:32